Saturday, August 2, 2025
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ వార్తకు స్పందన..

నవతెలంగాణ వార్తకు స్పందన..

- Advertisement -

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ.. హోటల్ యజమానికి జరిమానా
నవతెలంగాణ – దుబ్బాక 

సాంబార్ లో పురుగులు తిన్నోళ్లకు వాంతులు అన్న నవతెలంగాణ వార్తకు స్పందన లభించింది. శుక్రవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జయరాం ఆధ్వర్యంలో దుబ్బాకలోని ఉడిపి శ్రీకృష్ణ భవన్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. వండిన ఆహార పదార్థాలు, నూనెలు, వంట సరుకుల శాంపిల్లను సేకరించారు. హైదరాబాదులోని ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించిన అనంతరం వచ్చిన ఫలితాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శేఖర్ హోటల్ యాజమాన్యానికి రూ.5 వేల జరిమానా విధించడం జరిగిందన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -