Tuesday, August 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ వార్తకు స్పందన

నవతెలంగాణ వార్తకు స్పందన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని లొంగన్ క్రాస్ రోడ్ వద్ద వ్యవసాయ భూమీకి దగ్గరగా వంగి ఉన్న ప్రమాదకర విద్యుత్ స్తంభాన్ని మద్నూర్ ఎన్డిపిసిఎల్ ఏఈ ఎం. గోపికృష్ణ ఆదేశాల మేరకు విద్యుత్ సిబ్బంది మంగళవారం వంగి ఉన్న స్తంభాన్ని నిటారుగా సరి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మద్నూర్ ఏఈ గోపికృష్ణ మాట్లాడుతూ.. బిచ్కుంద నుంచి పెద్ద లైన్ జుక్కల్ మీదుగా మద్నూర్ మండలంలోని సోముర్  సబ్ స్టేషన్ కు విద్యుత్తు సరఫరా జరుగుతుంది. ఈ సబ్ స్టేషన్ నుండి జుక్కల్ మండలంలోని హంగర్గా ఫీడర్ ద్వారా పలు గ్రామాలకు విద్యుత్ ప్రసరణ జరుగుతుందని తెలిపారు. 

పరిధి జుక్కల్ మండలమే అయినా మెయింటెనెన్స్ మొత్తం మద్నూర్ ఏఈ ఆధ్వర్యంలోని జరుగుతుంది.  ఈ సంఘటన  ఇటీవలే రెండు మూడు రోజుల క్రితం గాలి వానకు విద్యుత్ స్తంభం వంగిపోవడం జరిగింది. ఈ విషయాన్ని నవతెలంగాణ తెలుగు దినపత్రిక వార్తను ప్రచురించారు. వెంటనే స్పందించి కృంగిపోయి ఉన్న  స్తంభాన్ని సిబ్బందితో కలిసి వెంటనే సరిచేయడం జరిగిందని తెలిపారు. వంగిపోయి ఉన్న విద్యుత్ స్తంభం ఉన్న భూమి వ్యవసాయదారుడు విద్యుత్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నవతెలంగాణ పత్రిక ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుందని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -