నవతెలంగాణ-పెద్దవూర
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పకడ్బందిగా బాధ్యతలు నిర్వర్తించాలని ఏఈ ఆర్ఓ, జంగాల కృష్ణయ్య అన్నారు. పెద్దవూర తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌వోలు, సిబ్బందికి నిబంధనలు నిర్వహణ తీరుపై అవగాహనతో కూడిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్త బూత్ స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే పెద్దవూర మండలంలోని బూత్ స్థాయి అధికారులకు సూపర్‌వైజర్లకు,మాస్టర్ ట్రైనర్ల కు శిక్షణా కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8ల విచారణ, నివేదిక సమర్పించడం, బూత్ లెవల్ అధికారి యాప్ వాడకం, ఓటర్ల జాబితా శుద్ధీకరణపై అవగాహన కల్పించామన్నారు.ఓటర్ జాబితా సవరణలలో బిఎల్వోలు జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరమే నూతన ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, బదిలీ, ఫొటో మార్పిడి తదితర సవరణలను చేపట్టాలని సూచించారు వచ్చే ఫారాలు, ఒకే వ్యక్తి పెద్ద మొత్తంలో ఇచ్చే ఫారాలపట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిస్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని అన్నారు.ఏఈఆర్ ఓ జంగాల కృష్ణయ్య,తహసీల్దార్ శ్రీనివాసరావు,ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి
ఎంఆర్ఐ హబీబ్,మాస్టర్ ట్రైనర్లు ఇరుమాది పాపిరెడ్డి,మేదరి దేవేందర్,మంచికంటి మధు, ధీరావత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈసీ నిబంధనల మేరకు పకడ్బందిగా బాధ్యతలు నిర్వర్తించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES