నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ విశ్రాంత ఉద్యోగుల సంఘంలో 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలు ఆగస్టు 5వ తేదీన నిర్వహించబోతున్నామని అధ్యక్షులు జ్ఞానేశ్వర్,ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి లు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 పోస్టులకు ఎన్నికలు జరుగుతాయని అందులో అధ్యక్షులు,కార్యదర్శి,ఫైనాన్ సెక్రెటరీ,అసోసియేట్ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు రెండు అందులో ఒకటి ఉమెన్,సహాయ కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ,పబ్లిసిటీ సెక్రెటరీ, కౌన్సిల్ మెంబర్స్ మూడు మొత్తం 12 పోస్టులకు ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఎన్నికలు ఆగస్టు 5వ తేదీ ఉదయం 9 నుంచి 12 వరకు నామినేషన్స్, 12 నుంచి 3 గంటల వరకు రిసిప్ట్ ఆఫ్ నామినేషన్స్,నామినేషన్స్ స్క్రుటీని,పబ్లికేషన్ ఆఫ్ వ్యాలీడ్ నామినేషన్స్ లిస్ట్ 4 గంటలకు,ఆగస్టు 7 వ తేదీన ఉదయం 10 నుండి 4 వరకు ఉపసంహరణ,పోటీదారుల పైనల్ లిస్ట్ 5 గంటలకు, ఎన్నికలు అవసరమైతే ఆగస్టు 10వ తేదీన 10 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించబడతాయని,పోలైన ఓట్లను 4 గంటల తర్వాత లెక్కిస్తారని,10 వ తేదీన లెక్కించిన ఓట్లతో ఫలితాలను ప్రకటిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్,ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కరుణాసాగర్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు రాంరెడ్డి,కోశాధికారి గంగారాం తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
5న విశ్రాంత ఉద్యోగుల సంఘ ఎన్నికలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES