- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే శ్రీ పి సుదర్శన్ రెడ్డి ని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ శుక్రవారం కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చొరవ చూపించాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని, నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ఆస్పత్రులలో అనుమతించాలని వారు విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ రెడ్డి ని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు సిర్ప హనుమాన్లు, ప్రసాదరావు, రాధా కిషన్, ఘంటా నరేందర్, సాంబశివరావు, మధుసూదన్, బాల్ దుర్గయ్య, కృష్ణారావు, భోజారావు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



