శిక్ష ఖరారు చేసిన బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం
బెంగళూరు: ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. దీంతోపాటు రూ.10లక్షల జరిమానా విధిస్తూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి రూ.7లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోశ్ గజానన హెగ్డే.. రేవణ్ణను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.కేఆర్ నగరకు చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర ఠాణాలో ప్రజ్వన్ రేవణ్ణపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై లైంగికదాడి కేసు నమోదు చేసింది. గన్నిగడ ఫాంహౌస్‌లో తనపై అఘాయిత్యం జరిగిందని బాధితురాలు (47) తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని లైంగికదాడి కేసులూ ప్రజ్వల్‌పై నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది.
లైంగికదాడి కేసులో రేవణ్ణకు జీవిత ఖైదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES