Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేవంతన్న ఆదర్శంతో స్థానిక పోరులో విజయం సాధిద్దాం 

రేవంతన్న ఆదర్శంతో స్థానిక పోరులో విజయం సాధిద్దాం 

- Advertisement -

జిల్లా పరిషత్ మాజీ పవర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి 
నవతెలంగాణ – రామారెడ్డి 

జూబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ల కృషి  ఫలితంగానే భారీ మెజారిటీ వచ్చిందని, వారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ శ్రేణులు  స్థానిక పోరులో గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని సూచించారు. మండలంలోని రెడ్డిపేట తండాలో మాట్లాడుతూ… వ్యక్తిగత, భేషజాలాలకు పోకుండా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు లక్ష్యంగా పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కాంగ్రెస్ నాయకునికి, కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల నుండి మహిళకు ఉచిత బస్సు, రైతులకు రు రెండు లక్షల రుణమాఫీ, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఉపాధ్యాయ నియామకాలు, ఉద్యోగ కల్పన, మహిళా సంఘాల బలోపేతం వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, సల్మాన్, కుమ్మరి శంకర్, గంగావత్ రవి నాయక్, ఇర్షద్, దయానంద్, గంగావత్ బోజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -