Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, పీయూష్‌ గోయల్‌, జేపీ నడ్డాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలకమైన జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. అదేవిధంగా వరంగల్‌లో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -