– బండకట్టి రంగనాయకసాగర్‌లో ఎత్తేస్తా
– నువ్వు మునిగితే కాళేశ్వరం నీళ్లు ఉన్నట్టు.. లేకుంటే లేదు : సీఎంపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
– కాళేశ్వరం కూలిందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం
– మక్క రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్
నవతెలంగాణ-చిన్నకోడూరు
‘రేవంత్‌రెడ్డి సిద్దిపేటకు రా.. నీకు బండకట్టి రంగనాయకసాగర్‌లో ఎత్తేసా.. నీళ్లు ఉండి నువ్వు మునిగిపోతే కాళేశ్వరం ఉన్నట్టు.. లేకుంటే లేదు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కూలిందని.. కేసీఆర్, హరీశ్‌రావును బండకేసి కొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రెక్కలు ముక్కలు చేసుకుని మక్కలు పండిస్తే.. విక్రయించిన తర్వాత నెలలు గడిచినా డబ్బులు చెల్లించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నకోడూరులో 450 మంది రైతులకు 59 రోజుల నుంచి రూ.45 కోట్లు చెల్లించలేదన్నారు. రైతు ప్రభుత్వం అంటూనే రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు చేసిన తర్వాత రెండ్రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పినప్పటికీ.. 50 రోజులు గడిచినా డబ్బులు చెల్లించలేదన్నారు. దాంతో యాసంగి పంట పెట్టుబడి కోసం రైతులు ప్రయివేటు మార్కెట్లో మక్కలను అమ్ముతున్నారని తెలిపారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ రూ.450 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది నుంచి పంటవేస్తేనే రైతుబంధు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్య రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సొసైటీ చైర్మెన్లు సదానందం గౌడ్, కనకరాజు, మాజీ వైస్ ఎంపీపీ కీసర్ పాపయ్య, కామనీ శ్రీనివాస్, బోచబోయిన శ్రీహరి, జంగిటి శ్రీనివాస్, ఇట్టబోయిన శ్రీనివాస్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డీ సిద్దిపేటకు రా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



