– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను విమర్శించే నైతిక అర్హత తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి లేదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం లాంటి అన్ని రంగాల్లో కేరళం దేశంలో అగ్రభాగాన నిలిచిందని గుర్తు చేశారు. కుల, మత, ప్రాంత విద్వేషాలకతీతంగా సీపీఐ(ఎం) నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రేవంత్‌రెడ్డికి సూచిం చారు. రైతుబంధు, మహిళలకు రూ.2500, రూ.4వేల ఆసరా పించన్ల పెంపు అమలుపై దృష్టి పెట్టాలని అన్నారు. పినరయి విజయన్ రాజకీయ అనుభవంత వయసు లేని రేవంత్‌రెడ్డి చర్చకు రావాలని పిలవడం అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. స్థాయికి మించిన మాటలు మాని తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించాలని హితవు పలికారు.
పినరయి విజయన్‌ను విమర్శించే అర్హత రేవంత్‌రెడ్డికి లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



