Wednesday, December 10, 2025
E-PAPER
Homeహైదరాబాద్పసలేని రేవంత్ రెడ్డి ప్రసంగం

పసలేని రేవంత్ రెడ్డి ప్రసంగం

- Advertisement -

– అంసా రాష్ట్ర అధ్యక్షులు: అంగరి ప్రదీప్
నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ :- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన బహిరంగ సభలో చేసిన ప్రసంగంలో పస లేదని, ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చాడని అంసా రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్ విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ “1000 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం హర్షణీయం, ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ఆ వెయ్యి కోట్లతో కేవలం అందమైన భవనాలు, రోడ్లు నిర్మించడం వల్ల కాంట్రాక్టర్లు, అధికార్లు కమీషన్లు దండుకోవడం తప్ప విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒరిగేది ఏమి లేదు. ఫీజు రీయింబర్స్మెంట్, ఏళ్ల తరబడి పేరుకుపోయిన హాస్టళ్ల మెస్ బకాయిలకు డబ్బుల విడుదలపై, యూనివర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకుల నియామకంపై, కాంట్రాక్టు అధ్యాపకులు, పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలపై, విద్యార్థి నిరుద్యోగలకు తీపి కబురు చెప్పేలా జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై నిర్ధిషమైన అభిప్రాయాన్ని చెప్పకుండా దాటవేసే ధోరణిలో మాట్లాడారు. ప్రపంచ స్థాయి పరిశోధనలు జరగాలనే రేవంత్ రెడ్డికి పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వాలనే కనీస అవగాహన లేదు. 108 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఓయూలో పరిశోధక విద్యార్థులకు మెస్ సౌకర్యం లేకపోవడం సిగ్గు చేటు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించడం, సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మాలలను నట్టేట ముంచేలా, అస్తవ్యస్థంగా, అశాస్త్రీయంగా చేసిన ఎస్సీ వర్గీకరణను రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని” అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -