Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్42 శాతం బీసీల రిజర్వేషన్ల పేరిట రేవంత్ డ్రామా

42 శాతం బీసీల రిజర్వేషన్ల పేరిట రేవంత్ డ్రామా

- Advertisement -

రేవంత్ బీసీ రిజర్వేషన్లు సాధిస్తే పదవికి రాజీనామా చేస్తా
బీసీలు ఒక్కటిగా పోరాడుతూ 2028లో రాజ్యాధికారం అందుకుందాం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

42శాతం బీసీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ ది నాటకం బీసీల రిజర్వేషన్ల పేరిట రేవంత్ డ్రామా ఆడుతున్నారు. రేవంత్ బిసి రిజర్వేషన్లు సాధిస్తే రాజీనామా చేస్తా అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ హోటల్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో విలేఖరులతో మాట్లాడుతు.. రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి అన్నారు. నిజామాబాద్ 9 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక ఎస్సీ రిజర్వు స్థానం పోగా 8 స్థానాలు ఓసి లకు ఇచ్చింది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ కూడా అదే చేసాయి అన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 25 లక్షల మంది లో 14 లక్షల మంది బీసీ లు ఉన్నా రాజకీయ ప్రాతినిధ్యం లేదన్నారు.

ఓకే ఒక్క పెరిక కులస్తుడు కామారెడ్డి గంప గోవర్ధన్ సీటు కేసీఆర్ లాక్కున్నాడు. కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ ఇస్తామంటుంది.. కానీ జనాబా దామాషా ప్రకారం మరో 15 కూడా కావాలి అన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్ విషయంలో తప్పించుకుంటుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఉన్ననాయకత్వం అంతా అగ్రవర్ణాలె. పోచారం పార్టీలు మారిన అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తే. అగ్రవర్ణ పార్టీలతో బీసీలకు న్యాయం జరగదు అని తెలిపారు. అగ్రవర్ణ పార్టీలకు మనకు విడాకులు జరగబోతున్నాయి. ఇకపై రెడ్ల ఓట్లు మాకొద్దు.. బీసీలా ఓట్లు మాత్రమే కావాలి అని పిలుపునిచ్చారు. మీ అంతలా మీరు ఉండండి మా అంతలా మేము ఉంటాం.

త్వరలో ఉమ్మడి జిల్లాలో బీసీ జేఏసీ రంగంలోకి దిగబోతుందని బీసీ నుంచే రాజకీయ పార్టీ వస్తుందని తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. కవిత, కేసీఆర్ ను బీసీల వ్యతిరేకులు కాబట్టే ఓడగొట్టారు అన్నారు. మా వెనకాల ఉన్నది బీసీ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లు ఐక్యత చాటాలి. నామినేషన్లు వేయడానికి కూడా అగ్రవర్ణాలు భయపడాలి అని పేర్కొన్నారు. అగ్రవర్ణాలను రాజకీయ సమాధి చేయడమే లక్ష్యం. బీసీలం ఒక్కటయినమ్ ఒక్కటిగానే పోరాడతాం. 2028 లో మా ఓట్లు మా సీట్లు నినాదం బీసీలదే రాజ్యాధికారం అన్నారు. బీసీలకు మించిన రాజకీయ శక్తి లేదు.. నా వెనకుంది బీసీ ప్రజలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. కవిత తో నాకు విబేధాలు లేవు ఆమె బిసి కాదు. బిసి నినాదం ఆమెకేం సంబంధం అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, బిసి పొలిటికల్ జె.ఏ సి సమన్వయకర్త ల వట్టె జానయ్య యాదవ్, సంగెం సూర్యారావు, బుస్సాపూర్ శంకర్,బిసి జె.ఏ సి నాయకులు బాస రమేష్ యాదవ్, రమేష్ పటేల్, డి నరేందర్, సతీష్ గౌడ్ ,  తాల్ల పెళ్లి చంద్రశేఖర్ , ప్రవీణ్ ముదిరాజ్ ,  జ్యోతి, రేఖ  , ప్రసాద్ రజక , బిసి జె.ఏ సి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad