Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంకొనసాగుతునైన రెవెన్యు సదస్సులు…

కొనసాగుతునైన రెవెన్యు సదస్సులు…

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
గత నాలుగురోజులు గా నిర్వహించిన రెవిన్యూ సదస్సుల్లో నేటివరకు మొత్తం 755 దరఖాస్తులు అందోనట్లు తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ తెలిపారు. అచ్యుతాపురం,కన్నాయిగూడెం రెవెన్యూ విలేజ్ ల పరిధిలోని అచ్యుతాపురం,కన్నాయిగూడెం పంచాయితీల లోని ఈ రెండు ప్రధాన గ్రామాలతో పాటు మరో  రెండు ఆవాస గ్రామాలైన దిబ్బగూడెం ల లో  మొత్తం మూడు ఆవాస గ్రామాల్లో శుక్రవారం రెవిన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 9 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించి,1000 దరఖాస్తులు పంపిణీ చేయగా 755 అర్జీలు అందాయని అన్నారు. ఇందులో సర్వే నెంబర్ లకు సౌబౌదించినవి 146,తప్పు ఒప్పులు సారి చేయడానికి 25, నిషేధిత భూములు జాబితాలో నుండి సాదారణ భూమికగా గుర్తించడానికి 03,ఆర్ ఓ ఆర్ సంబంధిత 238,ఇతర సమస్యలకు చెందినవి 325 అర్జీలు వచ్చాయని వివరించారు. ఇందులో డీటీ హుస్సేన్, ఆర్ఐ లు పద్మావతి, క్రిష్ణ, ఎస్.ఏ లు లక్ష్మయ్య, చైతన్య, ఆర్.ఏ లు ఎం.రమేష్, శ్రీశైలం, టైపిస్ట్ టి.పీ వెంకన్న, చైన్ మెన్ సన్యాసి లు, కార్యదర్శులు వెంకటమ్మ,శోభన్ బాబులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img