మొదటి రోజు 250 దరఖాస్తులు స్వీకరణ
తహసీల్దార్ రామక్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట: గుంటిమడుగు, ఖమ్మంపాడు, నందిపాడు రెవిన్యూ గ్రామాల లో పరిధిలోని నందిపాడు, కోయ రంగాపురం పంచాయితీల్లో మంగళవారం జరిగిన రెవిన్యూ సదస్సులో కుడుములపాడుతో సహా మొత్తం 5 ఆవాస గ్రామాలు నుండి మొత్తం 250 దరఖాస్తులు అందినట్లు తహశీల్దార్ సీ హెచ్.వీ రామక్రిష్ణ తెలిపారు. ఇందులో సర్వే నెంబర్ సంబంధించినవి 21, సరిచేయడానికి వచ్చినవి 3, ఆర్ఓఆర్ 55, ఇతరాలు కు చెందినవి 171 మొత్తం 250 దరఖాస్తులు అందాయని వివరించారు. వీటి లోనే 18 పీఓ టి కాగా,171 ప్రభుత్వ భూమిలో గిరిజనుల సాగు చేసుకుంటున్న పోడు భూమికి పట్టాలు ఇవ్వాలనే అర్జీలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ రామక్రిష్ణ తో పాటు డీటీ హుస్సేన్,ఆర్ఐ లు పద్మావతి,క్రిష్ణ,కార్యదర్శులు క్రాంతి కుమార్,అలివేలు పాల్గొన్నారు.
ప్రారంభమైన రెవిన్యూ సదస్సులు..
- Advertisement -
- Advertisement -



