Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష సమావేశం ..

ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష సమావేశం ..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్: జిల్లా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, నగర మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్, ఉన్నత అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ శనివారం నగరంలోని పోలీస్ కమీషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు.. రాష్ట్రంలో అత్యంత పెద్ద నగరాలలో ఒకటైన ఇందూర్ నగర అభివృద్ధి, సుందరికరణకు అందరం సమిష్టి కృషితో ముందుకు పోవాలన్నారు నగరంలో జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదురుకుంటున్నారని అన్నారు.ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఫుట్ పాత్ ఖాబ్జాలు, సిగ్నల్ పాయింట్స్, వన్ వే రోడ్, పార్కింగ్ విషయాలలో కఠిన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలేత్తకుండా చూసుకోవాలన్నారు.ఇందూర్ జిల్లాలో డ్రగ్స్ & గంజాయి మహమ్మారి విచ్చలవిడిగా సరఫరా జరుగుతుందని వందల మంది యువత తమ బంగారు భవిష్యత్తు మత్తులో చిత్తూ చేసుకుంటున్నరని అన్నారు.గంజాయి & డ్రగ్స్ మారకద్రవ్యలు సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని ఉక్కుపాదం మోపాలని సూచించారు, ముఖ్యంగా పాఠశాల, కళాశాల క్యాంపస్ లో మారకద్రవ్యలపై విద్యార్థులకు అవగాహనా సదస్సులు నిర్వహించాలని విజ్ఞప్తి చేసారు.నగరంలో గ్యాంగ్ వార్ లతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న అల్లరి మూకలను ఉపేక్షేంచేది లేదు అన్నారు లా & ఆర్డర్ అదుపు చేయడంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహారించాలని అన్నారు.అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా దుకాణాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటు గత కొద్ది రోజుల నుండి నిర్ణీత సమయానికి ముసివేయడంలో విజయం సాధించిన పోలీస్ శాఖను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img