Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వరికి ఎండు తెగులు.. రైతన్న కుదేలు

వరికి ఎండు తెగులు.. రైతన్న కుదేలు

- Advertisement -

పంట సస్యరక్షణకు ఆర్థిక భారం
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ మండలాల్లో అత్యధికంగా నిజాంసాగర్ ఆయకట్టు కింద వరి పంట అధిక విస్తీర్ణంలో సాగవుతున్నది. వరి పంట ప్రస్తుతం చాలా చోట్ల పిలక దశలో ఉన్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితును బట్టి వరిపంటను ఎండాకు తెగులు అధికంగా సోకడంతో రైతన్నలు ఆందోళన గురవుతున్నారు. ఆరంగలం కష్టపడి పంట సాగు చేస్తే కష్టపడి పండించిన పంటకు ఎండు తెగులు రావడంతో మరింత ఆర్థిక భారం పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్ బీర్కూర్ మండలాల్లో అత్యధికంగా వారికి ఎండు తెగులు సోపడంతో పిచికారి చేసేందుకు అధిక భారం పెరుగుతుందని. చీడపీడలు ఆశించడంతో దిగుబడులు తగ్గి రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది.

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి..నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి, మిర్జాపూర్, నాచుపల్లి, దుర్కి, తదితర గ్రామాల్లో అత్యధికంగా పంట పొలాలకు ఎండు  తెగులు సోకడంతో రైతన్నలు వివిధ రకాల మందులను పిచికారి చేస్తున్నారు. ఈ ఎండు తెగులు వలన రైతులకు మరింత ఆర్థిక భారం పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ అధికారులు పంటపొలాలను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతన్నలు కోరుతున్నారు.

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి: మండల వ్యవసాయ అధికారిణి..భవాని

ఎండాకు తెగులు నివారణ కోసం రైతులు మందుల కోసం చూడకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలంలో ఎండాకు తెగులు లక్షణాలను గుర్తించిన వెంటనే దగ్గరలో ఉన్న రైతువేదికకు వెళ్ళి మండల విస్తీర్ణం అధికారులను సంప్రదించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో రైతులు ఎండాకు తెగులు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇష్టం వచ్చిన మందులను వాడరాదని సూచనల మేరకే పిచికారి చేయాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad