అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్
నవతెలంగాణ – వనపర్తి
ఘణపురం మండలంలో ఎస్వీఎస్ ఇండస్ట్రీస్ కొత్త రైస్ మిల్లును ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు చేసుకోగా…గురువారం అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్ మిల్లుకు సంబంధించిన అనుమతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిబంధనల ప్రకారం మిల్లును ఏర్పాటు చేయాలని యజమానికి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అనంతరం వనపర్తి మండలంలో ఉన్న ఆంజనేయ ట్రేడర్స్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రైస్ మిల్ లో ఉన్న నిల్వ దాన్యాన్ని పరిశీలించారు. ధాన్యంలో కొనుగోలు నిలువలకు సంబంధించిన అధికరణం క్షుణంగా పరిశీలించి ధ్యానం విలువల లభ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిల్లర్లతో మాట్లాడుతూ… ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను కొనుగోలు విషయంలో మోసగించద్దని అన్నారు. జిల్లాలో ఉన్న మిల్లులో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. రెవెన్యూ కలెక్టర్ ఖిమ్యా నాయక్ వెంట సివిల్ సప్లై అధికారి కాశి విశ్వనాథం సిబ్బంది ఉన్నారు.
నిబంధనల ప్రకారం రైస్ మిల్లు ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES