-మార్కెట్ ఛైర్మెన్ అబ్ధుల్ హాధి..
నవతెలంగాణ – సారంగపూర్
వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్ధుల్ హాధి అన్నారు. సోమవారం సారంగాపూర్ మండలంలోని మలక్ చించొలి,బిరవెల్లి గ్రామాల్లో డిసిఎంఎస్ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.
రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రహించి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2389/-పొందాలన్నారు. ఈ కార్యక్రంలో మార్కెట్ వైస్ చైర్మన్ శంకర్ రెడ్డి నాయకులు నరేష్, భుమారెడ్డి,రవీందర్ రెడ్డి ,రాజేశ్వర్ ,మురళీ, లక్ష్మన్, సాయన్న, ఇస్మాయిల్, ముత్యం, మల్లయ్య, నిర్వాహకులు సాయి రెడ్డి, రమణయ్య, రైతులు పాల్గొన్నారు.



