Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ జిల్లా ఓబీసీ సెల్ అధికార ప్రతినిధిగా చిక్కుల వెంకటేష్  

కాంగ్రెస్ జిల్లా ఓబీసీ సెల్ అధికార ప్రతినిధిగా చిక్కుల వెంకటేష్  

- Advertisement -

పైడాకుల అశోక్ ములుగు జిల్లా డిసిసి అధ్యక్షులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ అధికార ప్రతినిధిగా చిక్కుల వెంకటేష్ను నియమిస్తున్నట్లు డిసిసి ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో వెంకటేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం వెంకటేష్ చేసిన సేవలను గుర్తించి మంత్రి సీతక్క సలహాలు సూచనలతో అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందని అన్నారు. పదవికి వన్నె తెచ్చే విధంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అశోక్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల రాధ – సుదర్శన్, ములుగు కౌన్సిలర్ గుంటోజు పావని – నిరంజన్ చారి, మాజీ ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, గ్రామ అధ్యక్షులు వేల్పుగొండ ప్రకాష్, యూత్ కాంగ్రెస్ నాయకులు తాటి శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -