1990 కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘రిమ్‌జిమ్’. అస్లీదమ్ అనేది ట్యాగ్‌లైన్. హేమ సుందర్ దర్శకత్వంలో సచేతన్ రెడ్డి, డా.మానస, శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. స్నేహం, ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ని పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ,’సినిమా అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పాటలు పాడటమే కాకుండా ఓ పాత్రలో నటించడం విశేషం. నిజ సంఘటనల ప్రేరణతో రాబోతున్న ఈ చిత్రాన్ని ఏవీ సినిమాస్, సి విజువల్స్ బ్యానర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈచిత్రంలో అజయ్ వేద్, ప్రజన జంటగా నటిస్తుండగా, బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : హేమ సుందర్, పాటలు : రాహుల్ సిప్లిగంజ్, సంగీతం : కొక్కిలగడ్డ ఇప్రాయిం, సినిమాటోగ్రఫీ : వాసు పెండం, ఎడిటింగ్ : పెనుమత్స రోహిత్.
గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ‘రిమ్ జిమ్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



