Friday, March 13, 2026
E-PAPER
Homeఆటలుఫామ్ యువరాజ్ సాయం తీసుకున్న రిషబ్ పంత్

ఫామ్ యువరాజ్ సాయం తీసుకున్న రిషబ్ పంత్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన వైట్ బాల్ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు, భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో ముంబైలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న పంత్, ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు. యువరాజ్ సింగ్ అంపైర్ స్థానం నుంచి పంత్ బ్యాటింగ్‌ను నిశితంగా గమనిస్తూ సలహాలు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది జనవరిలో వెన్నునొప్పితో జట్టుకు దూరమైన పంత్, తిరిగి ఫామ్ అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శిక్షణా శిబిరంలో ఆధునిక వైట్ బాల్ క్రికెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, మానసిక దృఢత్వంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.”రిషబ్ తన ఆటను, ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అతను బరువు కూడా తగ్గాడు. తన వైట్ బాల్ గేమ్‌ను మరింత మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో పంతే స్వయంగా యువరాజ్‌ను సంప్రదించాడు. ముంబైలోని సీసీఐ మైదానంలో మూడు, నాలుగు రోజుల పాటు ఈ శిక్షణ జరిగింది” అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -