Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండిసెంబర్‌ 8,9 తేదీల్లో రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌

డిసెంబర్‌ 8,9 తేదీల్లో రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌

- Advertisement -

భారీ బందోబస్తు, రోడ్‌ మ్యాప్‌ పరిశీలన : రాచకొండ సీపీ సుధీర్‌బాబు

నవతెలంగాణ-సిటీబ్యూరో
డిసెంబర్‌ 8, 9 తేదీల్లో మహేశ్వరం జోన్‌ మీర్‌ఖాన్‌పేట పరిధిలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’కు భారీ బందోబస్టు ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు. ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ బందోబస్తును శుక్రవారం సీపీ పర్యవేక్షించారు. వీవీఐపీలకు ఎలాంటి అసౌకర్యం, అంతరాయం కలగకుండా అడుగడుగునా నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలోని మీర్‌ఖాన్‌పేటలో వంద ఎకరాల్లో సమ్మిట్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులతోపాటు స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌, అక్టోపస్‌, ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. పార్కింగ్‌ స్థలం, హెలిప్యాడ్‌ ప్రదేశం, మీటింగ్‌ ప్రదేశాన్ని రోడ్‌ మ్యాప్‌ను సీపీ పరిశీలించి.. అధికారులకు సలహాలు సూచనలు చేశారు. సీపీ వెంట మహేశ్వరం డీసీపీ సునీతరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏపీసీ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -