Friday, July 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి మట్టం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి మట్టం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగం నుండి గరువారం ఇన్‍ ఫ్లో 8718 క్యూసెక్కులకు పెరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గోదావరి నదిపై అక్కడి ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు మంగళవారం పైకి ఎత్తడం తో దిగువనున్న ఎస్సారెస్పీకి నీటి ప్రవాహం పెరిగింది. బుధవారం ఇన్‍ ఫ్లో 6713 క్యూసెక్కులు కాగా, గురువారం ఇన్ ఫ్లో 8718 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వాటర్ లెవెల్ 1065.30 ఫీట్లు, 16.405 టీఎంసీలు ఉండగా, గురువారం ఉదయం 6 గంటలకు వాటర్ లెవెల్ 1065.80 ఫీట్లు, 17.103 టీఎంసీలకు పెరిగింది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు టీఎంసీల వరకు నీటి మట్టం పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 1091 ఫీట్లు, 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో వాటర్ లెవెల్ 1065.30 ఫీట్లు, 16.405 టీఎంసీలు ఉంది. గతేడాది ఇదే రోజు ప్రాజెక్టులో నీటి నిలువ 1060.60 ఫీట్లు, 11.126 టీఎంసీలుగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -