Monday, December 8, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రీతూ చౌదరి ఎలిమినేట్‌..కప్పు తీసుకుని మా ఇంటికి రా

రీతూ చౌదరి ఎలిమినేట్‌..కప్పు తీసుకుని మా ఇంటికి రా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బిగ్‌బాస్‌ సీజన్‌9 నుంచి రీతూ చౌదరి ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో డిమోన్‌ పవన్‌, సంజన, రీతూ చౌదరి, సుమన్‌శెట్టి, తనూజ, భరణిలు ఉండగా, ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన రీతూ ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున తెలిపారు. మరోవైపు ఈ సీజన్‌ దాదాపు చివరికి వచ్చేసింది. రీతూ ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఇంకా ఏడుగురు మిగిలారు. వీరిలో టాప్‌-5 మాత్రమే ఫైనల్‌కు వెళ్తారు.

రీతూ ఎలిమినేషన్‌ తర్వాత బయటకు వచ్చి, తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి గురయ్యారు. హౌస్‌లో ఉన్న ఏడుగురికి ఏయే స్థానాలు ఇస్తావంటూ వ్యాఖ్యాత నాగార్జున రీతూను అడిగారు. ఇప్పటికే ఒకసారి బయటకు వెళ్లిన వచ్చిన భరణిని ఏడో స్థానంలో ఉంచారు. నామినేషన్స్‌లోనే కాదు, విడిగానూ బాగా మాట్లాడాలంటూ సుమన్‌శెట్టికి ఆరో నెంబర్‌ ఇచ్చారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారంటూ సంజనాకు ఐదో ప్లేస్‌ ఇచ్చారు. ఇక నాలుగులో కల్యాణ్‌ను ఉంచిన రీతూ.. మూడు, రెండు స్థానాలను ఇమ్మాన్యుయేల్‌, తనూజలకు ఇచ్చారు. డిమోన్‌ పవన్‌ నెం.1 స్థానంలో ఉంటాడంటూ బిగ్‌బాస్‌ సీజన్‌9 విజేత కావాలని ఆకాంక్షించారు. కప్పు తీసుకుని తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -