Saturday, November 15, 2025
E-PAPER
Homeజాతీయంఆర్జేడీ పరాజయం..లాలూ కుమార్తె సంచలన నిర్ణయం

ఆర్జేడీ పరాజయం..లాలూ కుమార్తె సంచలన నిర్ణయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణంగా పరాజయం పాలైంది. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని పార్టీ కనీసం గౌరవప్రదమైన సీట్లను కూడా సంపాదించలేకపోయింది. పార్టీ చరిత్రలోనే రెండో అత్యంత దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంది.

ఇదిలా ఉంటే, ఈ ఫలితాలు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. తాజాగా, లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలను వదిలిపెడుతున్నట్లు చెప్పింది. తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని ఆమె ఎక్స్‌‌లో పోస్ట్ చేసింది. ఆర్జేడీ రెబల్ సంజయ్ యాదవ్, తన భర్త రమీజ్ ఆలం సలహాతో తాను ఈ చర్య తీసుకున్నానని చెప్పింది. తాను అన్ని నిందల్ని భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఇప్పటికే లాలూ కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్‌ ఆర్జేడీ నుంచి బహిష్కరించబడ్డాడు. ఆయన ఈ ఎన్నికల్లో సొంత పార్టీని ఏర్పాటు చేసుకుని పోటీ చేశాడు. మహువా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -