Wednesday, December 10, 2025
E-PAPER
Homeఆటలుఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన రో-కో

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన రో-కో

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అద్భుతమైన ఫామ్ లో టీమ్ఇండియా రన్ మిషన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. రోహిత్ శర్మ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో వీరు తమ సత్తా చాటారు. రోహిత్‌ శర్మ.. రాంచీ, విశాఖపట్నం వన్డేల్లో హాఫ్‌ సెంచరీలు (57, 75) సాధించాడు. మరోవైపు కోహ్లీ మొదటి రెండు వన్డేల్లో వరుస సెంచరీలు (135, 102), మూడో వన్డేలో హాఫ్‌సెంచరీతో (65*) అద్భుతమైన ఫామ్‌తో విన్‌టేజ్‌ విరాట్‌ను గుర్తుకుతెస్తున్నాడు. ఓవరాల్‌గా 302 రన్స్‌తో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ మూడో ర్యాంక్‌కు పడిపోగా, అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ నాలుగో స్థానంలో, భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఐదో స్థానంలో నిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -