- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనక నుంచి ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్‌ను అరగంటకుపైగా శ్రమించి పోలీసులు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై 4 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంకర్‌ను పక్కకు తరలించి ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు.
- Advertisement -



