- Advertisement -
నవతెలంగాణ- జన్నారం
మండలంలోని పొల్కల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పైడిపల్లి హనుమాన్ టెంపుల్ మూలమలుపు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రంలోని వీర్లగుట్ట శ్రీ కేతేశ్వర కంకాలమ్మ ఆలయ పూజారి రేగుంట భూమయ్యకు ముఖంపై కాళ్లకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో, 108 సిబ్బంది వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని గాయాల పాలైన రేగుంట భూమయ్యను వాహనంలో తీసుకొని చికిత్స కోసం లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం భూమయ్య ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
- Advertisement -



