ఆరుగురు మృతి
ముంబయి : మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. సప్తసృంగీ మతా ఆలయానికి వెళుతుండగా, ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన ఇన్నోవో కారు 800 అడుగుల లోయలో ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఘటనాస్థలంలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం 4 గంటలకు భవారి వాటర్స్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇరుకైన ఘాట్‌లో ఓవర్‌టేక్ ప్రయత్నంలో కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. మృతులంతా పటేల్ కుటంబానికి చెందినవారని, అత్యంతదగ్గర బంధువులని తెలిపారు. కాగా, ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -



