Saturday, November 1, 2025
E-PAPER
Homeజాతీయంరాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మహిళ సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన లారీ.. వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని ఫలోడి-బికనీర్‌ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసుల విచారణలో తేలింది. మధ్యప్రదేశ్‌ నుంచి ఏటా పత్తి తీయడం కోసం కూలీలు ఫలోడికి వస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా పత్తి తీసేందుకు వస్తున్న కూలీల వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో మొత్తం 16 మంది ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు మాత్రమే ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -