- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్ : మండలంలోని పి ప్రీ గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గర శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించినారు. పిప్పిరి నుండి ఆర్మూర్ వైపు స్కూటీపై వస్తున్న శ్రీనివాస్ విజయ్ లను ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన శ్రీనివాస్ పట్టణంలోని ప్రీమియర్ బార్ యందు పని చేస్తున్నట్లు తెలిసింది. సంఘటన స్థలానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నవి.
- Advertisement -



