Sunday, November 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్ర‌మాదం

హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్ర‌మాదం

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: న‌ల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందున్న లారీని వేగంగా ఢీ కొట్టి అదుపుతప్పింది. అదే వేగంతో ముందుకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారుపై పడిపోయింది. ఈ ఘటనలో రెండు కార్లలో ఉన్న పలువురు గాయపడ్డారు.రోడ్డు ప్రమాదం కారణంగా కొయ్యలగూడెం బ్రిడ్జి వద్ద ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ప్రమాద సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.మన్మథ కుమార్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రి తరలించి జాతీయ రహదారిపై స్తంభించిన వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.జాతీయ రహదారిపై తరచుగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణమే జాతీయ రహదారిని ఎనిమిది వరుసల జాతీయ రహదారి ఏర్పాటు చేస్తే కానీ ఇక్కడ ఇబ్బందులు తప్పేటట్లు లేవని స్థానికులు కోరుతున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -