నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులోని గ్రీన్ సిటీ వెంచర్ సమీపంలో కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ తప్పనిసరి వాడకం, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు ఎలా తగ్గించవచ్చో తెలియజేయడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు బేసిక్ లైఫ్ సపోర్ట్ (బిఎల్ఎస్) పద్ధతులపై అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



