Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలురోడ్డు భద్రతా మనందరి బాధ్యత: మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి  

రోడ్డు భద్రతా మనందరి బాధ్యత: మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి  

- Advertisement -

నవతెలంగాణ- ఇబ్రహీంపట్నం
రోడ్డు భద్రతా మనందరి బాధ్యతగా గుర్తించి ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చాలని మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి తెలిపారు. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ నేపథ్యంలో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి శనివారం ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. తన పోలీసు సిబ్బందితో రాష్ట్ర బంద్ ప్రభావాన్ని ఆరా తీశారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఉద్యోగులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో చెక్ చాట్ నిర్వహించారు. మహిళా ఉద్యోగుల సాధక బాధకాలను ఆరా తీశారు. ఇది నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బస్సుల్లో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె దృష్టికి తెచ్చారు. పీక్ ప్యాకెట్ దొంగతనాలు చోటు చేసుకుంటున్నయని ఉద్యోగులు తెలిపారు. విధి నిర్వహణలో తమకు ఎదురయ్యే పరు సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి డీసీపీ సునీతా రెడ్డి మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల రక్షణ కోసం పోలీసు సి టీం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు ఎలాంటి సమస్యలున్నా సీటీం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇదే తరుణంలో ఆర్టీసీ డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ బస్సులు నడపాలన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని సూచించారు. ఇతర వాహనాలకు ఇబ్బందులు కలిగించకుండా బస్సులు నడపాలన్నారు. ప్రయాణికులతో స్నేహ పూర్వకంగా మెలగలన్నారు. బస్సుల్లో చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండేలా ప్రయాణికులను అప్రమత్తం చేయాలని వివరించారు. మహిళాలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు.

బీసీ కోట కోసం రాష్ట్ర బంద్ కు బీసీ జేఏసీ పిలుపునివ్వడంతో విద్య సంస్థలు, వ్యాపార సమూహాలు స్వచ్చందంగా బంద్ ను పాటించాయి. కాంగ్రెస్, సీపీఐ(ఎం), బీఆర్ఎస్, బీసీ సంఘాలు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి వ్యాపార సముదాయాలను మూయించారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ సిబ్బంది స్వచ్చందంగా బంద్ పాటించారు. ఇబ్రహీంపట్నం చౌరస్తా, ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద బంద్ ను మహేశ్వరం డీసీపి సునీతా రెడ్డి, డీసీపి వీమేన్ సేఫ్టీ వింగ్ షీ టీమ్ డీసీపి ఉష పరిశీలించారు. డీసీపీ వెంట ఇబ్రహీంపట్నం ఎసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్ రెడ్డి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -