Tuesday, August 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబంజారాహిల్స్ లో అకస్మాత్తుగా కుంగిన రోడ్డు..

బంజారాహిల్స్ లో అకస్మాత్తుగా కుంగిన రోడ్డు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి బంజారాహిల్స్ లో ఓ రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ట్యాంకర్ నేలలో కూరుకుపోయింది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ తో పాటు క్లీనర్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో నెలలో కూరుకుపోయిన ట్యాంకర్ ను తొలగించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడ్డ డ్రైవర్, క్లీనర్ లను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -