Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోతకు గురైన రోడ్లను మరమ్మతు చేయాలి 

కోతకు గురైన రోడ్లను మరమ్మతు చేయాలి 

- Advertisement -

మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి 
నవతెలంగాణ – రామారెడ్డి 

మండలంలో పోసానిపేట్, రంగంపేట, మద్దికుంట, రెడ్డిపేట్ , రామారెడ్డి తో పాటు పలు గ్రామాలు, తాండాలలో భారీ వర్షానికి కోతకు గురైన పిఆర్, ఆర్ అండ్ బి రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ… రంగంపేట నుండి పోసానిపేట ఆర్ అండ్ బి రోడ్ వరకు కోతకు గురైన పిఆర్ రోడ్డును పరిశీలించామని, సంబంధిత ఈ ఈ తో ఫోన్లో మాట్లాడి సమస్యను దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి మరమ్మతులు చేపడతామని సూచించినట్లు తెలిపారు. ఒకవేళ మరమ్మత్తులు చేపట్టకపోతే వివిధ గ్రామాల ప్రజలతో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు టంకరి రవి, సిహెచ్ తిరుపతి, మేర రవి, భూదాన్ బాలరాజు, తెడ్డు దినేష్, కమ్మరి బాలరాజ్, నా రెడ్డి రాజిరెడ్డి, సింగం కృష్ణ, పోతుల శివారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -