Sunday, July 20, 2025
E-PAPER
Homeకరీంనగర్కూలుతున్న రోడ్డు పక్క బావులు...పొంచి ఉన్న ప్రమాదం

కూలుతున్న రోడ్డు పక్క బావులు…పొంచి ఉన్న ప్రమాదం

- Advertisement -

– ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం….
నవతెలంగాణ – గన్నేరువరం

రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి నుండి మండల కేంద్రం గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనుల్లో ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో రోడ్డుపక్క బావులు, రక్షణ గోడలు విషయంలో ఆర్ అండ్ బీ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకుండా వాటికి నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టర్ రోడ్డు పక్క బావుల రక్షణ చేయడం లేదని ప్రచారం సాగుతుంది. గునుకుల కొండాపూర్ లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి కి సంబంధించిన వ్యవసాయ బావి పూర్తిగా ధ్వంసమై రోడ్డు పక్కన పెద్దగోతి ఏర్పడి ప్రమాద కరంగా మారింది. గత కొద్ది రోజుల క్రితం నెహ్రు చౌరస్తా సమీపంలో ఓ బావి ఇదే మాదిరిగా కూలడం జరిగింది. రాత్రి వేళల్లో వాహనదారులు ఈ బావుల వద్ద ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన తర్వాత అధికారులు చేసేదేమీ లేదు. ఈ రెండు బావులు ప్రస్తుతం వాహనదారులకు అతి ప్రమాదంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు తక్షణం స్పందించి బావుల యజమానులను ఒప్పించి వారికి తగిన నష్టపరిహారం ఇచ్చి ప్రమాద కరమైన బావులను పూడ్చివేసే విధంగా చర్యలు చేపట్టాలని వాహనదారులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -