Monday, November 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజల్సాల కోసం దారి దోపిడీలు, మోసాలు

జల్సాల కోసం దారి దోపిడీలు, మోసాలు

- Advertisement -

– ఐదుగురు నిందితులు అరెస్ట్‌
– ఆరు సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం
– కాటారం డీఎస్పీ సూర్యనారాయణ
నవతెలంగాణ-కాటారం

జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ఘరానా దొంగల ముఠాను జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.48 లక్షల నగదు, ఆరు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాటారం డీఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను డీఎస్పీ ఏ. సూర్యనారాయణ ఆదివారం వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన రాజు సోలంకి, మహారాష్ట్రలోని కారేగావ్‌కు చెందిన శాంతి విజయ సోలంకి, స్వప్న ఈశ్వర్‌ సోలంకి, నాగపూర్‌కు చెందిన పుణ్య బాల చందర్‌ రాథోడ్‌, పుణ్య రాథోడ్‌.. జల్సాలకు అలవాటుపడి అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు దొంగలుగా మారారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మబలికి కాటారం కేంద్రంలోని ఓ సూపర్‌ మార్కెట్‌ యజమానిని ఆర్థికంగా మోసం చేయడం, నస్తురు పల్లి వద్ద ఓ వ్యక్తిపై భౌతిక దాడి చేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. వీటిపై ఫిర్యాదు రావడంతో జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే ఆదేశాలతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చింతకాని గ్రామ శివారులో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మగ, ముగ్గురు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కేసును ఛేదించిన కాటారం సీఐ ఈవూరి నాగార్జున రావు, ఎస్‌ఐలు ఎకుల శ్రీనివాస్‌, జక్కుల మహేష్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రవీణ్‌, కానిస్టేబుళ్లు రాజు, నాగరాజు, రామారావు జంపన్న, ఐటీ కోర్‌ వేణును ఎస్పీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -