– గంగుల కిష్టారెడ్డి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.
– రూ.60 వేల నగదుతో పాటు మూడున్నర తులాల బంగారం అపహరణ
– ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీస్ క్లూస్ టీమ్
నవతెలంగాణ –శివ్వంపేట :
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. పిల్లుట్ల గ్రామానికి చెందిన గంగుల కిష్టారెడ్డి రిటైర్డ్ వీఆర్ఓ కిష్టారెడ్డి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు కాగా అందరికి వివాహాలు జరిపించగా, ఇంట్లే వృద్ధ దంపతులు మాత్రమే ఉంటున్నారు.
ఇది అదునుగా భావించిన దొంగలు నిచ్చేన వేసుకొని కమాన్ పొయ్యి నుండి ఇంట్లోకి ప్రవేశించి, కిష్టారెడ్డి బెడ్ పరుపు కింద దాచిన రూ.50 వేలతో పాటు డబ్బాలో దాచి ఉంచిన మూడున్నర తులాల బంగారం దోచుకెళ్లారు. ఎస్ఐ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘటన స్థలికి చేరుకున్న పోలీస్ క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తున్నారు.



