జిల్లా విద్యాశాఖ అధికారికి విద్యార్థి సంఘాల వినతి
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలో సి బి ఎస్ ఈ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రాక్ వుడ్ పాఠశాల గుర్తింపు రద్దు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF) రాష్ట్ర నాయకులు విజయ్ పుట్టపాగ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం టిపిటిఎల్ఎఫ్, డివైఎఫ్ఐ, ఐద్వా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖాధికారి అబ్దుల్ ఘనీని బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఉన్న రాక్ వుడ్ స్కూల్ ఈ సి బి ఎస్ ఈ నిబంధనలు పాటించకుండా, ఇష్టారీతిగా వ్యవహరిస్తూ, అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారని డిఈఓ దృష్టికి తెచ్చారు.
ఆ పాఠశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న వారికి కనీస అర్హతలు లేవని, అలాంటి వారిని ప్రిన్సిపాల్ గా ఎలా కొనసాగిస్తారని, ఆ పాఠశాలలో చాలా మంది అర్హతలు లేనివారిని టీచర్లుగా కొనసాగిస్తూ సిబిఎస్ఈ ప్రమాణలానే తుంగలో తొక్కారని అన్నారు. పాఠశాలలో టీచర్స్ కు చాలీ చాలని జీతాలిస్తూ వారితో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యంతో కలిసి ఫీజు నిర్ణయ కమిటీ వేయాలనే నిబంధనను గాలికి వదిలేసి, వారి ఇష్టనుసారంగా ఫీజులను నిర్ణయించి, తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, తల్లిదండ్రులు ఫీజులు కట్టడంలో కాస్త ఆలస్యమైతే పిల్లలను తరగతి గది బయట నిలబెట్టి అవమానిస్తున్నారని అన్నారు.
వేలకువేలు ఫీజులు వసూలు చేస్తూ, సిబిఎస్ఇ ప్రమాణలను మాత్రం గాలికి వదిలేసారని, తక్షణమే డి ఈ ఓ ఆ పాఠశాలను తనిఖీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన డి ఈ ఓ ఆ పాఠశాలను సందర్శించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో టి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి జి. మహేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జి. సాయిలీల తదితరులు ఉన్నారు.
రాక్ వుడ్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES