Wednesday, October 29, 2025
E-PAPER
Homeఆటలువన్డేల్లో నంబర్‌ 1 బ్యాటర్‌గా రోహిత్ శర్మ

వన్డేల్లో నంబర్‌ 1 బ్యాటర్‌గా రోహిత్ శర్మ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ ఆడిన రోహిత్ శర్మ అదరగొట్టాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శనకు ఐసీసీ ర్యాంకుల్లో ఫలితం కనిపించింది. వన్డేల్లో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు అక్కడ ఉన్న కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ రెండు స్థానాలు కిందికి దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 781 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ (764) రెండో స్థానంలో ఉండగా.. శుభ్‌మన్‌ గిల్ (745), బాబర్ అజామ్ (739), విరాట్ కోహ్లీ (725) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆసీస్‌తో మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ విరాట్ ఒక స్థానం పడిపోయాడు. అంతకుముందు రెండు మ్యాచుల్లోనూ డకౌట్‌ కావడమే దీనికి కారణమని క్రికెట్ విశ్లేషకుల అంచనా. శ్రేయస్‌ అయ్యర్ (700) టాప్ -10లో కొనసాగుతున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -