Thursday, October 30, 2025
E-PAPER
Homeఆటలురోహిత్‌ శర్మ 18ఏండ్ల తర్వాత..ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి

రోహిత్‌ శర్మ 18ఏండ్ల తర్వాత..ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి

- Advertisement -

దుబాయ్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చరిత్ర సృష్టించాడు. దాదాపు 18ఏండ్ల తర్వాత తొలిసారి ఐసీసీ పురుషుల వన్డే బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ 781రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో సెంచరీ, అర్ధసెంచరీతో రాణించి వన్డే బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకొన్నాడు. ముఖ్యంగా మూడో, చివరి వన్డేలో కోహ్లీతో కలిసి రోహిత్‌ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌, ఇండియన్‌ కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ను ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ ఓవర్‌టేక్‌ చేశాడు.

వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ర్యాంకింగ్స్‌లో పైచేయి సాధించాడు. 781 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు రోహిత్‌ శర్మ ఇక ఇబ్రహీం 764 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ మాత్రం 725 పాయింట్లతో బ్యాటింగ్‌ ర్యాంకుల్లో ఆరో స్థానంలో ఉన్నాడు. 38ఏండ్ల బ్యాటర్‌ రోహిత్‌ తన కెరీర్‌లో తొలిసారి వన్డే ర్యాంకుల్లో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడతను. ఆ సిరీస్‌లో అతను 101 సగటుతో మొత్తం 202 పరుగులు చేశాడు. వన్డే బ్యాటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ అగ్రస్థానంలో నిలవడం శుభపరిణామం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -