Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోశయ్య ఆర్థిక సంస్కరణలు చిరస్మరణీయం

రోశయ్య ఆర్థిక సంస్కరణలు చిరస్మరణీయం

- Advertisement -

పరకాల యంపీడీఓ పెద్ది ఆంజనేయులు
నవతెలంగాణ – పరకాల 
: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా, తమిళనాడు, కేరళ రాష్ట్ర గవర్నర్ గా పని చేసి ఇటీవలే పరమపదించిన కొణిజేటి రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పరకాల మండల పరిషత్ కార్యాలయంలో యంపీడీఓ పెద్ది ఆంజనేయులు రోశయ్య చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా యంపీడీఓ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి అని తమ ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రభుత్వాలు ఎలాంటి లోటు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించాయని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు సి.హెచ్ శైలశ్రీ, ఏపీఓ ఇందిర, కార్యాలయ సిబ్బంది, పరకాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర్యదేవర సదానందం, పరకాల వాసవీ మాత ఆలయం అధ్యక్షుడు తమిశెట్టి వెంకటేశ్వర్లు పరకాల మాజీ సర్పంచ్ బొచ్చు చందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిన్నాల గోనాథ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -