Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeసినిమారూ.1000 కోట్ల స్కామ్‌

రూ.1000 కోట్ల స్కామ్‌

- Advertisement -

విజయ్‌ ఆంటోనీ హీరోగా నటిస్తున్న తన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్‌ ప్రభు దర్శకుడు. నియో-నోయిర్‌ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 19న రిలీజ్‌ రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మేకర్స్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.
తాత తన మనవడికి జీవిత పాఠాలను నేర్పడంతో మొదలైన ట్రైలర్‌ ఆ తర్వాత వెయ్యి కోట్ల రాజకీయ స్కామ్‌లోకి వెళుతుంది. ఆ స్కామ్‌ వెనక ఉన్న మిస్టీరియస్‌ మ్యాన్‌ ఎవరనే కోణంలో సాగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా నిలిచింది. ఇందులో విజయ్‌ ఆంటోనీ పాత్రే ఆ పజిల్‌. అలాగే విజయ్‌ ఆంటోనీ స్వయంగా చేసిన మ్యూజిక్‌, బీజీఎం స్కోర్‌ కథని ఇంకా ఎలివేట్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌, రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియాతో కలిసి రిలీజ్‌ చేయబోతోంది. ఈ చిత్రానికి నిర్మాత: రామాంజనేయులు జవ్వాజి (సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌), సమర్పకులు: మీరా విజయ్‌ ఆంటోని.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad