Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు

ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు

- Advertisement -

– నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు
– 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌
– అమరావతిలో చేనేత మ్యూజియం, ఐదు చోట్ల క్లస్టర్లు : జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
మంగళగిరి :
చేనేత కళాకారుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. మంత్రి నారా లోకేష్‌ సహకారంతో గతంలో ఏర్పాటైన వీవర్‌శాలను సందర్శించి అక్కడ చేనేత కళాకారులతో కాసేపు మాట్లాడారు. ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడుతూ చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈ నెల నుండే అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో చేనేత మగ్గాలు ఉన్న 93 వేల కుటుంబాలకు, పవర్‌ లూమ్స్‌ ఉన్న 50 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఇందుకోసం ఏడాదికి రూ.190 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని మాస్టర్‌ వీవర్లు, కళాకారులు ఉత్పత్తుల్లో రూ.1,375 కోట్ల టర్నోవర్‌ సాధించారన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చేనేత పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలనే తపన ఉన్న పారిశ్రామికవేత్త సుచిత్రా ఎల్లాను సలహాదారుగా పెట్టుకున్నామని, వన్‌ ప్రొడెక్ట్‌, వన్‌ డిస్ట్రిక్ట్‌ కింద రాష్ట్రానికి వచ్చిన తొమ్మిది అవార్డుల్లో నాలుగు చేనేత రంగానికే వచ్చాయని తెలిపారు. వన్‌ ప్రొడెక్ట్‌, వన్‌ డిస్ట్రిక్ట్‌ ద్వారా ఉత్పత్తుల మార్కెట్‌ విస్తరిస్తున్నామని, ఇప్పటికే రెండు వేల చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదయ్యాయని తెలిపారు. చేనేతకు చేయూత ఇచ్చేందుకు నేషనల్‌ రూరల్‌ లైవ్లీ హుడ్‌ మిషన్‌ కింద మంగళగిరి,

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img