Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వెల్నెస్ సెంటర్ కు రూ.30 లక్షల కేటాయింపు

వెల్నెస్ సెంటర్ కు రూ.30 లక్షల కేటాయింపు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల కొరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పరిధిలో నిజామాబాదులో మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహిస్తున్న వెల్నెస్ సెంటర్ కు అదనపు సౌకర్యాలు, ఆధునీకరణకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ వారు రూ.30 లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించేందుకు టెండర్లు పిలిచారని, సెప్టెంబర్ లో పనులు ప్రారంభిస్తారని మున్సిపల్ కమిషనర్ తనను కలిసిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు. ఆ మేరకు ఆదివారం పెన్షనర్స్ భవన్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ అధ్యక్షులు శిర్ప హనుమాన్లు.. మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి  చొరవ,సహకారం మూలంగా వెల్నెస్ సెంటర్ ను పటిష్టపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. సంఘ ఆధ్వర్యంలో వెల్నెస్ సెంటర్ కొరకు అనేక ఉద్యమాలు, ప్రాతినిధ్యాలు చేయటం మూలంగా వెల్నెస్ సెంటర్ అన్ని సదుపాయాలతో, సౌకర్యాలతో మరమ్మత్తులు , ఆధునీకరణ ప్రక్రియ జరగనున్నదని ఆయన తెలిపారు. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో ఆల్ పెన్షనర్స్ యూనియన్ నాయకులు నరేంద్ర, రాధా కిషన్, లావు వీరయ్య ,సాంబశివరావు, పురుషోత్తం రావు ,రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad