ముగిసిన కోకాపేట నియోపోలిస్ వెంచర్ వేలంపాట
నవతెలంగాణ-హైదరాబాద్(హెచ్‌ఎండీఏ)
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ నియోపోలిస్ భూ వేలం విజయ వంతంగా పూర్తి అయినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో 1.98 ఎకరాల గోల్డెన్ మైల్ స్థలాన్ని కోయస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ కంపెనీ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ స్థలం ప్రత్యేక ఆకారంలో ఉండటంతో దీనికి మంచి రేటు పలికినట్టు అధికారులు తెలిపారు. ఈ వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు మొత్తం రూ.3,862.8 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. మెట్రోపాలిటన్ ప్రాంతంలో సముచిత స్థలాలకు ఎంత డిమాండ్ ఉందో ఈ-వేలం ద్వారా స్పష్టం అవుతోందని అన్నారు. హైదరాబాద్‌ను భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా ఈ ఫలితాలు మరింత బలపరుస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ-వేలంతో రూ.3,862 కోట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



