Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు మంజూరు

మండల అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు మంజూరు

- Advertisement -

– నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు
కాంగ్రెస్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సిందం శశికాంత్
నవతెలంగాణ – రాయపోల్ :  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుందని, రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో అధ్వానంగా మారిన రోడ్లు, మురికి కాల్వల సమస్యలను పరిష్కరించేందుకు రూ.50 లక్షలు నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సిందం శశికాంత్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను చేపట్టనున్నారు. పనులు ఉపాధి హామీ పథకం (ఎస్ఆర్ఈజీఎస్) కింద నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హైమావతి సంబంధిత అధికారులకు పరిపాలన అనుమతులు జారీ చేసి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామాల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రహదారులు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారమవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వర్షాకాలంలో రహదారులు బురదమయంగా మారడం, మురికి నీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా నిర్మించనున్న సీసీ రహదారులు, డ్రైనేజీలతో గ్రామాల్లో రాకపోకలు సులభతరం కావడంతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడనుంది.రాయపోల్ మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి రూ.15 లక్షలు, రామారం రూ.10 లక్షలు, తిమ్మక్ పల్లి రూ.10 లక్షలు, లింగారెడ్డిపల్లి రూ.10 లక్షలు, గ్రామాలకు 10 లక్షల, వీరారెడ్డిపల్లి రూ.5 లక్షలు చొప్పున గ్రామాలకు నిధులు మంజూరయ్యాయి. కాగా నిధులు మంజూరు చేయించిన దుబ్బాక నియోజకవర్గ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -