– రెండు చేనేత సంఘాలకు రుణాల రెన్యువల్
– హాజరుకానున్న మంత్రులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల వస్త్ర, చేనేత పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మిక కుటుంబాలకు వివిధ పథకాల లబ్ధి వారికి అందించేందుకు ఏర్పాటు చేసింది. నేతన్న పొదుపు, నేతన్న బీమా, చేనేత సంఘాలకు రుణాలు రెన్యువల్ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ సందీప్ కుమార్ జా తెలిపారు
ఒక్కొకరికి కనీసం రూ. 30 వేలు
నేతన్న పొదుపు(త్రిఫ్ట్) కింద మూడు సంవత్సరాల కాలానికి సంబంధించి రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమకు చెందిన కార్మికులకు రూ. 68 కోట్ల 14 లక్షలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో నేతన్న పొదుపు కింద నమోదు అయి వాటా ధనం చెల్లించిన 4,963 మంది వస్త్ర పరిశ్రమ కార్మికులకు రూ. 24 కోట్ల 80 లక్షలు పంపిణీ చేయనున్నారు. అలాగే నేతన్న బీమాలో నమోదై మరణించిన 12 మంది కార్మిక కుటుంబాల నామినీలకు ఒక్కొకరికి రూ. ఐదు లక్షల చొప్పున మొత్తం రూ. 60 లక్షలు పంపిణీ చేయనున్నారు. రెండు చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ కింద రుణాలు రెన్యువల్ చేసే పత్రాలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 02.00 గంటలకు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం బై పాస్ రోడ్డులోని కే కన్వెన్షన్ హాల్ లో మంగళవారం మధ్యాహ్నం 02.00 గంటలకు ఆయా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పథకాల ఫలాలు అందజేయనున్నారు.
12 మందికి రూ. 60 లక్షల నేతన్న బీమా మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES