- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ హోటల్ లాకర్ నుంచి రూ.60 లక్షలకు పైగా నగదును దుండగుడు కాజేశారు. పట్టణంలోని హోటల్ వైష్ణవి గ్రాండ్ నిర్వాహకులు కొద్ది రోజులుగా తమకు వచ్చిన నగదును హోటల్‌లోని మొదటి అంతస్తులోని లాకర్‌లో భద్రపరిచారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ దుండగుడు హోటల్‌లోకి ప్రవేశించి నగదును తీసుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -